VIDEO: ప్రాణాలు కాపాడిన బ్లూ కోల్ట్స్ పోలీసులు
KMR: ఆత్మహత్యకు పాల్పడుతున్న వ్యక్తిని నిన్న బాన్సువాడ బ్లూకోల్ట్స్ పోలీసులు కాపాడారు. పాత బాన్సువాడ గూడెంగల్లికి చెందిన రంగారి వెంకటి తనకు ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందంటూ డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తి ఉరేసుకుని వేలాడుతున్న సమయంలో తలుపులు పగలగొట్టి అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుళ్లను DSP, CI అభినందించారు.