ఎడారిగా మారిన గోదావరి..!
PDPL: రామగుండం నగరాన్ని ఆనుకొని ప్రవహించే గోదావరి వేసవి ప్రారంభంలోనే ఎడారిగా మారింది. రామగుండం నుంచి విడుదలవుతున్న మురుగు నీటి ప్రవాహం తప్ప చుక్క నీరు లేదు. నదిలోని ఇన్‌ఫిల్ట్రేషన్ బావుల చుట్టూ మురుగు చేరడంతో అదే నీరు పంపుహౌస్‌లోకి వెళ్తోంది. కాగా ఈ పంపుహౌస్ ద్వారానే సింగరేణి కార్మికులు నివసించే కాలనీ ప్రాంతాలకు రోజు మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు.