మహిళా పోలీసుల సాధికారతే లక్ష్యం: డీజీపీ
KNR: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లో నిర్వహించిన 'షీ లీడ్స్' సదస్సులో డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు. మహిళా పోలీసులు వృత్తిపరంగా, సామాజికంగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. పోలీసు శాఖలో మహిళలకు కల్పించిన రిజర్వేషన్లు, భరోసా కేంద్రాల పనితీరును కొనియాడారు.