VIDEO: అకాల వర్షం.. రైతులకు తీవ్ర నష్టం

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో సోమవారం భారీ వర్షం కురిసింది. గాలులతో కూడిన ఈ వర్షం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొక్కజొన్న, మిరప పంటలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. ఈ అకాల వర్షాలతో రైతులు, ప్రజలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. నష్టపోయిన వారికి ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరారు.