VIDEO: నెమలి వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్న అనురాధ
NTR: గంపలగూడెం(M) నెమలి స్వయంభూ శ్రీ వేణుగోపాల స్వామిని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఆమె గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట టీడీపీ నేతలు ఉన్నారు.