కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని వెస్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాన్ని అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ పరిశీలించారు. శుక్రవారం జరగనున్న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ, పోలీస్ బందోబస్తును ఆయన సమీక్షించారు. అనుమతి లేని వ్యక్తులు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.