'కాంట్రాక్టు కార్మికులకు స్థిరపదవి కల్పించాలి'

'కాంట్రాక్టు కార్మికులకు స్థిరపదవి కల్పించాలి'

GDWL: కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి మున్సిపాలిటీల్లో పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గట్టన్న డిమాండ్ చేశారు. గద్వాల జిల్లా సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్మికుల న్యాయ హక్కుల కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.