పిచ్చికుక్క దాడిలో మహిళకు తీవ్ర గాయాలు
MBNR: మరికల్ మండలం ఇబ్రహీంపట్నంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. డంపింగ్ యార్డ్ సమీపం నుంచి వచ్చిన ఈ కుక్క.. ఓ వృద్ధురాలు సహా ఇద్దరిని గాయపరిచింది. ఇంకా పశువులపైనా దాడి చేసింది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో MBNR ఆసుపత్రికి తరలించారు. అధికారులు స్పందించి గ్రామంలో కుక్కల బెడద నుంచి కాపాడాలని కోరారు.