డిగ్రీ ప్రవేశాల దరఖాస్తులకు నేడు చివరి తేదీ

డిగ్రీ ప్రవేశాల దరఖాస్తులకు నేడు చివరి తేదీ

TPT: పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ (UG) కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు మంగళవారంతో ముగుస్తుందని కళాశాల ప్రిన్సిపల్ చంద్రమౌళి పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు కళాశాలలో సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇంటర్మీడియట్ పాసైన అభ్యర్థుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.