లింగాల ఎస్సై బదిలీ.. ఇంఛార్జ్‌గా హెడ్ కానిస్టేబుల్
NGKL: లింగాల మండల ఎస్సై వెంకటేశ్వర్ గౌడ్ పెబ్బేరుకు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కొత్త ఎస్సై విధుల్లో చేరే వరకు పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ బాధ్యతలను హెడ్ కానిస్టేబుల్ వెంకటేష్‌కు అప్పగించారు. గత కొంతకాలంగా ఇక్కడ పనిచేసిన వెంకటేశ్వర్ గౌడ్‌ను సిబ్బంది సంతోషంతో విడ్కోలు ఇచ్చారు.