VIDEO: బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
కోనసీమ: మామిడికుదురు మండలం పాసర్లపూడి బ్రిడ్జి వద్ద సుమారు రూ. 8.82 కోట్ల వ్యయంతో నిర్మించబోయే బీటీ రోడ్డుకు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాసర్లపూడి బ్రిడ్జి నుంచి ఆదుర్రు మోర్‌పాలెం వరకు సుమారు బీటీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం అన్నారు. నియోజకవర్గంలో 90 శాతం సీసీ రోడ్లు పూర్తి చేసామన్నారు.