గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ

గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ

ADB: వ్యవసాయ భూములలో గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. నార్నూర్ మండలంలోని సుంగపూర్‌కు చెందిన కొడప దేవురావు గంజాయి సాగు చేస్తున్నాడన్న సమాచారంతో సోమవారం సీసీఎస్ బృందం, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. పట్టుబడిన వారి నుంచి రూ.9.5 లక్షల విలువ గల గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.