శ్రీ రంగనాథునికి ఉగాది ప్రత్యేక పూజలు

శ్రీ రంగనాథునికి ఉగాది ప్రత్యేక పూజలు

KRNL: పత్తికొండ డివిజన్ మద్దికేర మండలం పెరవలి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథునికి ఉగాది పర్వదినాన ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ఆర్ వీరయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకోవాలని అన్నారు.