ఓవర్ బ్రిడ్జిపై టిప్పర్ బీభత్సం.. పది మేకలు మృతి
BDK: సుజాతనగర్ మండలం మంగపేట రైల్వే ఓవర్ బ్రిడ్జిపై బుధవారం మట్టితో వెళ్తున్న టిప్పర్ బీభత్సం సృష్టించినట్లు స్థానికులు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. జూలూరుపాడు నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న లారీ మేకల మందపైకి దూసుకు వెళ్లడంతో పది మేకలు అక్కడికక్కడే మృతి చెందాయని చెప్పారు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.