'త్యాగాలకు వెనుకాడని కేడర్ టీడీపీ సొంతం'

'త్యాగాలకు వెనుకాడని కేడర్ టీడీపీ సొంతం'

AP: టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడారు. త్యాగాలకు వెనుకాడని కేడర్ టీడీపీ సొంతమని తెలిపారు. రేపటి కోసం సైన్యాన్ని సిద్ధం చేసే వర్క్ షాప్ జరుగుతోందని అన్నారు. చంద్రబాబు అనుభవం, లోకేష్ యువ నాయకత్వం.. NTR ఆశీర్వాదాలతో భవిష్యత్ టీడీపీదే అని పల్లా పేర్కొన్నారు.