విద్యార్థులు తల్లిదండ్రులతో సందడిగా ప్రభుత్వ పాఠశాలలు
AKP: నర్సీపట్నం మండలంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం పండగ వాతావరణం నెలకొంది. మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు భారీగా పాఠశాలలకు చేరుకుని విద్యార్థులతో గడిపారు. పలువురు తల్లిదండ్రులు తమ పిల్లల పురోగతిపై తమ అభిప్రాయాలు తెలియజేశారు. అలాగే విద్యార్థులు తయారు చేసిన పరికరాలతో ప్రదర్శన ఇచ్చారు.