VIDEO: జన్నారంలో కుండపోత వర్షం

MNCL: జన్నారం మండలంలో రెండు గంటలుగా అతి భారీ వర్షం నమోదవుతుంది. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జన్నారం మండల కేంద్రంతో పాటు ధర్మారం, కిస్టాపూర్, కామన్పల్లి, మొర్రిగూడ, మురిమడుగు, చింతగూడ, తపాలాపూర్, తిమ్మాపూర్, రాంపూర్ గ్రామాలలో భారీ వర్షం ప్రారంభమై దంచి కొడుతోంది. ప్రధాన రహదారి, చాలా గ్రామాల రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.