400 కేసులకు రాజీ పరిష్కారం: అడ్వకేట్ ఆర్కే

400 కేసులకు రాజీ పరిష్కారం: అడ్వకేట్ ఆర్కే

MHBD: తొర్రూర్ పట్టణంలోని శనివారం కోర్టులో నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌లో సుమారు 400 కేసులను రాజీ, అడ్మిషన్ ద్వారా పరిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అడ్వకేట్ ఆర్కే మాట్లాడుతూ.. ప్రజలు, కక్షిదారులు లోక్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పలు కేసుల్లో మొత్తం రూ.8 లక్షల జరిమానాలు విధించినట్లు తెలిపారు.