త్రాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు

NTR: చందర్లపాడు మండలం వెలదికొత్తపాలెంలో త్రాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు మండిపడ్డారు. ఇంటింటికి మంచి నీటి పంపులు వేసి మూడు నెలలు అయినా నీరు వదల లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులకు, గ్రామ నాయకులకు చెప్పిన స్పందన లేదని వాపోయారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి త్రాగునీరు అందించాలని కోరారు.