మట్టి మనుషులు గ్రంథం ఆవిష్కరించిన ఎమ్మెల్యే
కృష్ణా: సమాజ హిత సాహిత్యమే నిజమైన సాహిత్యమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం నాగాయలంకలో గ్రంథాలయంలో కవి జి.సూర్యనారాయణ రచించిన మట్టి మనిషి కవితా సంపుటిని బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. విశ్వజనీయమైన కవిత్వం సృష్టించిన రవీంద్ర నాథ్ ఠాగూర్, గురజాడ అప్పారావు, సినారే వంటి వారు చరిత్రలో శాశ్వతంగా నిలిచారన్నారు.