కాలనీకి నిధులిస్తారా.. రాజీనామా చేస్తారా?

SRPT: జిల్లా బరాఖత్‌గూడెంలోని ఇందిరమ్మ కాలనీ 2008లో పేదల కోసం ఏర్పాటు చేసిన ఇప్పటివరకు రోడ్లు, డ్రైనేజ్ లేక అల్లకల్లోలం అవుతుందని బహుజన నేత రాయిరాల సుమన్ మౌర్య ఆరోపించారు. ఇందిరమ్మ పేరుతో ఓట్లు తీసుకున్న నాయకులు కాలనీని మాత్రం అభివృద్ధి పరచడం లేదన్నారు. 'నిధులు ఇవ్వండి లేకపోతే పదవులకు రాజీనామా చేయండి అని డిమాండ్ చేస్తూ.. రోడ్డుపై ఉన్న మురిగినీటిలో కూర్చొని నిరసన తెలిపారు.