VIDEO: కొయ్యూరులో సెల్ఫ్ డిఫెన్సుపై అవగాహన
ASR: బాలికలకు స్వీయ రక్షణ (సెల్ఫ్ డిఫెన్సు)పై అవగాహన ఉండాలని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు సూచించారు. బుధవారం సీఐ ఆధ్వర్యంలో స్థానిక కేజీబీవీలో విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్సుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎవరైనా బాలికలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే, ధైర్యంగా ప్రతిఘటించి ఎదుర్కోవాలని సూచించారు. తమను తాము రక్షించుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.