గొట్టాబ్యారేజీలోకి పెరుగుతున్న వరద నీరు

శ్రీకాకుళం: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గొట్టాబ్యారేజీలోకి 13449 వరద నీరు చేరడంతో బ్యారేజ్ 17 గేట్లు 20 సెంటీమీటర్లు ఎత్తి దిగువ భాగానికి విడుదల చేసే అవకాశం ఉందని డీఇ సరస్వతి తెలిపారు. బుధవారం రాత్రి 8 గంటలకు వంశధార నదిలో12,112 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుందని, ఎడమ కాలువకు1337 క్యూసెక్కుల సాగు నీటిని సరఫరా చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.