గుంటూరులో తెలంగాణ అమ్మాయి మిస్సింగ్

గుంటూరులో తెలంగాణ అమ్మాయి మిస్సింగ్

గుంటూరు గుజ్జనగుండ్ల నివాసితులు ఊటుకూరు జ్యోతి అక్క కూతురు గోన శ్రీవల్లి (17) తెలంగాణ నుంచి 18వ తేదీ ఉదయం గుంటూరు వచ్చింది. కుటుంబ సభ్యులు కలిసి 19వ తేదీ రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. ఉదయాన్నే శ్రీవల్లి కనపడటం లేదు. చుట్టూ ప్రాంతాల్లో ఎక్కడ వెతికినా కనిపించలేదు. జ్యోతి శ్రీవల్లి కనపడటం లేదని పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.