సమస్యలను మంత్రికి విన్నవించిన ఎమ్మెల్యే

సమస్యలను మంత్రికి విన్నవించిన ఎమ్మెల్యే

TPT: రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరుపతికి వచ్చిన హోం మంత్రి అనితకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి కలంకారి శాలువతో ఆమెను సత్కరించారు. శ్రీకాళహస్తికి సంబంధించిన పలు సమస్యలపై మంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆమెకు వినతి పత్రం అందజేశారు.