VIDEO: మధుమేహ నిర్ధారణ అవగాహన శిబిరం
ASF: కాగజ్ నగర్ RTC బస్టాండ్‌లో లయన్స్ క్లబ్, మార్వాడీ యువ మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం మధుమేహ నిర్ధారణ అవగాహన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథి లయన్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్ రతన్ గేన్, శాంతి కుమార్, అరుణ్ లోయ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.