'కార్మిక హక్కులు ఏఐటీయూసీ పోరాట ఫలితం'
KMM: మధిరలో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎంఏ రహీం మాట్లాడుతూ.. దేశంలో కార్మికులు పొందిన హక్కులన్నీ ఏఐటీయూసీ పోరాటాల ఫలితమేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కోడ్లుగా మార్చి కార్మిక సంక్షేమాన్ని దెబ్బతీస్తోందని ఆయన విమర్శించారు.