'రైతులు, వరి కోత యంత్రాల యజమానులు అప్రమత్తంగా ఉండాలి'
JGL: మొంథా తుఫాను ప్రభావంతో, జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో, రైతులు, వరి కోత యంత్రాల యజమానులు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ సూచించారు. జిల్లాలో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉన్నందున, ఇప్పటికే పంటలు కోతకు సిద్ధంగా ఉండడంతో రైతులు కోతలను వాయిదా వేసుకోవాలన్నారు.