రెబల్స్‌పై బీజేపీ చర్యలు.. కేంద్ర మాజీమంత్రిపై వేటు

రెబల్స్‌పై బీజేపీ చర్యలు.. కేంద్ర మాజీమంత్రిపై వేటు

సొంత పార్టీపై రెబల్‌కు దిగిన నేతలపై బీజేపీ చర్యలు చేపట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గానూ కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్ సహా మరో ఇద్దరిని సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలంటూ సదరు నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.