దుద్దె వెంకటసుబ్బయ్య నేత్రదానం

దుద్దె వెంకటసుబ్బయ్య నేత్రదానం

KDP: పులివెందుల పట్టణం పార్నపల్లి రోడ్‌కు చెందిన దుద్దె వెంకటసుబ్బయ్య (90) మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్న నేత్రదానం నిర్ణయం ఇద్దరు అంధులకు కొత్త చూపుని అందించింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, స్నేహిత అమృత హస్తం సేవాసమితి ఆధ్వర్యంలో కార్నియాలను సేకరించి హైదరాబాద్‌లోని డాక్టర్ అగర్వాల్ నేత్రనిధికి పంపించారు.