నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే

నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే

ATP: శింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానికులతో మమేకమై వారి యోగక్షేమాలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఆమె తెలిపారు.