రేపల్లెలో వ్యక్తి అనుమానాస్పద మృతి

రేపల్లెలో వ్యక్తి అనుమానాస్పద మృతి

BPT: రేపల్లె పట్టణంలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆటో స్టాండ్ వద్ద డ్రైనేజీ కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకి తీసి, నిజాంపట్నం మండలం యడ్లంక గ్రామానికి చెందిన సురేష్ (40)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.