బ్రహ్మశ్రీ మంచే హరీష్ శర్మకు ప్రత్యేక బిరుదు
JGL: జగిత్యాల రూరల్ మండలం అనంతారం వాసి బ్రహ్మశ్రీ మంచే హరీష్ శర్మను ప్రముఖ జ్యోతిష్య సంస్థ సన్మానించింది. గత 15 ఏళ్లుగా వాస్తు, జ్యోతిష్య రంగాల్లో ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా, ప్రముఖ గ్రంథకర్త పుచ్చా శ్రీనివాసరావు చేతుల మీదుగా 'జ్యోతిష్య విద్యారత్న' బిరుదుతో పాటు 'సువర్ణ కంకణం' అందజేశారు. ఈ పురస్కారం పట్ల మిత్రులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.