VIDEO: జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

VIDEO: జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

ASR: గంజాయి అక్రమ రవాణాలపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా జీ.మాడుగుల మండలం మత్స్యపురం జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 1,000 కేజీల గంజాయి పట్టుబడినట్లు డీఎస్పీ అభిషేక్ తెలిపారు. డ్రైవర్ పరారీలో ఉండగా, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. బొలెరోతో పాటు, 3 ఫోన్లను సీజ్ చేశారు.