ఆకతాయికి చుక్కలు చూపించిన విదేశీ మహిళలు

ఆకతాయికి చుక్కలు చూపించిన విదేశీ మహిళలు

ఢిల్లీలో తమను వేధించిన ఓ కామాంధుడికి విదేశీ మహిళలు రోడ్డుపైనే బడితపూజ చేశారు. భారత్‌లో పర్యటించడం కోసం వచ్చిన ముగ్గురు మహిళలను ఒక వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. దాంతో వాళ్లు అస్సలు తగ్గకుండా అతడిని రోడ్డుపై చితకబాదారు. కళ్లముందు ఇంత జరుగుతున్నా జనం చోద్యం చూస్తూ ఉండిపోయారు. కానీ ఆ మహిళలు మాత్రం ధైర్యంగా తిరగబడి.. అతను మళ్లీ ఇలా చేయకుండా తగిన బుద్ధి చెప్పారు.