'ఇంటర్న్‌షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి'
PPM: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువత తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలో ప్రత్యక్ష పని అనుభవం పొందేందుకు ఈ పథకం ఒక గొప్ప వేదిక అని అన్నారు.