శ్రీరామనవమి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
KDP: మైదుకూరు సమీపంలోని పార్వతీ నగర్‌లో శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ పార్వతీ నగరుకు చెందిన కొండపల్లి శేషగిరి, కృష్ణయ్య యాదవులు, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ప్రసన్న సీతారామస్వామి కళ్యాణం ఘనంగా ఉంటుందని తప్పక రావాలని వారు ఎమ్మెల్యేను కోరారు.