VIDEO: సిరిపురంలో శరవేగంగా ఆలయ నిర్మాణం
SRPT: నడిగూడెం మండలంలోని సిరిపురంలో కనకదుర్గమ్మ ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాతల ఉదారతతో చేపట్టిన ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి, అమ్మవారి పునఃప్రతిష్ఠాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం ప్రకటించారు. గ్రామ పెద్దలు, భక్తుల సహకారంతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.