ఎరువుల పంపిణీపై సభ్యుల ఆగ్రహం

ఎరువుల పంపిణీపై సభ్యుల ఆగ్రహం

SKLM: ఎల్.ఎన్.పేట మండలంలో ఎరువుల పంపిణీపై గౌరవ సభ్యులు మండల సర్వసభ్య సమావేశంలో ఏవో సింహాచలంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రెడ్డి జ్యోతిలక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ డీలర్ల వద్ద ఎరువులు కొనుగోలు చేస్తే లింకుగా పురుగుల మందు అంటగడుతున్నారని ఆరోపించారు. ఎరువుల సమస్యలు పరిష్కరించాలన్నారు.