ఏడుపాయల చెక్ డ్యామ్‌లో మునిగి వ్యక్తి మృతి

MDK: ప్రమాదవశాత్తు నీట మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన ఏడుపాయల వన దుర్గామాత ఆలయ సమీపంలో చెక్ డ్యామ్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం మరికల్‌కు చెందిన దేవరపాగ వీరస్వామి(40) శుక్రవారం ఓ విందు నిమిత్తం కుటుంబంతో కలిసి ఏడుపాయలకు వచ్చారు. స్నానం చేసేందుకు ఆలయ సమీపంలో ఉన్న చెక్ డ్యామ్ వద్దకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు.