ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి: CI
NRML: సారంగాపూర్ మండలం సాయినగర్ తండాలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌ను రూరల్ సీఐ కృష్ణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. సరైన పత్రాలు లేని 45 బైక్స్, 4 ఆటోలను స్వాధీనం చేసుకుని, జరిమానాలు విధించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వారికి వివరించారు.