వైపర్తలో వైద్య శిబిరం
SKLM: బూర్జ మండలం వైపర్త పీహెచ్‌సీ వైద్య సిబ్బంది శుక్రవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గత రెండు రోజులుగా అధిక వర్షాలు వలన సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉండడంతో ప్రజలకు పలు ఆరోగ్య సూచనలు చేశారు. కొన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. త్రాగే నీరు పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఏఎన్ఎం జగదాంబ, రాధిక, ఆశా కార్యకర్తలు ఉన్నారు.