బాల్య వివాహాలు గురించి అవగాహన

NLR: రాపూరు మండలంలోని వేపినాపి అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం కిశోర వికాసం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా స్థానిక ప్రజలకు బాల్య వివాహాలు గురించి అవగాహన కల్పించారు.18 సంవత్సరాలు నిండిన తర్వాతే ఆడపిల్లలకు పెళ్లి చేయాలని సూచించారు. చిన్న వయసులోనే ఆడపిల్లలకు పెళ్లి చేయడం వలన వచ్చే అనారోగ్య సమస్యలను వివరించారు.