పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేకి వినతి

పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేకి వినతి

VZM: భోగాపురం మండలం ముంజేరులో మురుగు కాలువ సమస్యపై ఎమ్మెల్యే లోకం నాగమాధవికి విన్నవించారు. ముంజేరు పార్టీ కార్యాలయంలో ఆదివారం గ్రామానికి చెందిన కూటమి నాయకులు మురుగు కాలువ సమస్యలను వివరించారు. ప్రధానంగా మురుగు కాలువ వల్ల దుర్గంధం వెదజల్లడం వల్ల వ్యాధులు సోకుతున్నాయని చెప్పారు. పారిశుధ్య పనులు చేపట్టాలని కోరారు.