రేపు జిల్లాలో పెన్షన్ల పంపిణీ: కలెక్టర్
GNTR: జిల్లాలో NTR భరోసా పెన్షన్ల పంపిణీ రేపు జరుగుతుందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,56,904 మందికి రూ.111.34 కోట్ల పెన్షన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ మేరకు అన్నీ ఏర్పాట్లు చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, మెప్మా, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, గ్రామ వార్డు సచివాలయ అధికారులను ఆదేశించారు.