'ప్రతి ప్రభుత్వ కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలి'
SRCL: ప్రతీ ప్రభుత్వ కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆదేశించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో 99 రోజుల కార్యక్రమాల అమలుపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఈ మేరకు కార్యాలయాల్లో స్వచ్ఛత.. పరిశుభ్రత పనులు పక్కాగా చేయాలని కలెక్టర్ సూచించారు.