'స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన కల్పించాలి'
E.G: గోకవరంలో స్వీయ జనగణన ప్రక్రియపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో గోవింద్ శుక్రవారం తెలిపారు. 2027 జనగణనలో భాగంగా తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ డిజిటల్ నమోదు విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రచారం చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలన్నారు.