VIDEO: ఉత్సవ వేడుకలు.. రంగవల్లికలతో మహిళల సందడి
SRD: సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట (ఈశ్వరపురం) గ్రామంలో వెలిసిన సప్త ప్రాకారయుత శ్రీ దుర్గా భవాని మహా క్షేత్రంలో 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన మహిళలు ఆలయ మండపం ఆవరణలో నేడు తెల్లవారుజామున రంగురంగుల రంగవల్లికలు వేశారు. దీంతో మహిళల సందడి నెలకొంది. ఈ ఉదయం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ మంగళహారతి సమర్పించార.