వాగు జోరు.. చేపల వేట షురూ.!

వాగు జోరు.. చేపల వేట షురూ.!

KMM: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణం జిల్లాలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరదల్లో చేపలు కొట్టుకొస్తుండటంతో స్థానికులు చేపల వేటలో నిమగ్నమయ్యారు. నర్సింహులగూడెం వద్ద వాగులో స్థానికులు చేపల వేటకు రావడంతో పెద్ద ఎత్తున సందడి నెలకొంది. తమకు కావాల్సిన చేపల కంటే అధికంగా లభించడంతో బయట విక్రయిస్తున్నారు.