పెద్ద ఇటికింపాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అంబటి

గుంటూరు: పొన్నూరు మండలం పెద్ద ఇటికింపాడు గ్రామంలో సోమవారం వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గ్రామ మహిళలు అంబటికి హారతి పట్టి జేజేలు పలికారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్రంలో మరింత సంక్షేమ పాలన కొనసాగాలంటే వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని అంబటి కోరారు.